బూచేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి (బి.వి.ఏస్. ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, మెటీరియల్స్, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ లు సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ రాచ పూడి రత్నంలు చేతుల మీదుగా ట్యాబ్ లు , పుస్తకాలు పంపిణీ చేశారు. తూర్పు చౌటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నాడు-నేడు, అమ్మవడి వంటి మంచి పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. పీసీ చైర్మన్ రాచపూడి ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు పి.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు మారం నాగిరెడ్డి. భాస్కర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *