దర్శి పట్టణంలో దర్శి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు 27వ రోజు చేస్తున్న నిరసనలో బాగంగా మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్పార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి నిరసన పాల్గొని సంఘీ బావం తెలిపారు. సీఐటీయూ కార్యదర్శి తాండవ రంగారావు, రైతు సంఘం నాయకులు సందు కోటేశ్వరరావు, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు అచ్చమాంబ, మోహన రావు, సుజాత, తిరుపతమ్మ, ప్రశాంతి, మల్లేశ్వరి, నాగలక్ష్మి, బాలమ్మ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.


