నంబర్ ప్లేట్ లు లేకుండా వాహనం నడిపితే చట్ట రీత్య నేరం – బేగం పేట టి టి ఐ ఏ సీ పి.శంకర్ రాజు.

వాహన దారులు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే అది చట్ట రీత్యా నేరం అని బేగంపేట టి టి ఐ ఏ సీ పి జి శంకర్ రాజు తెలియజేశారు. ఏ సి.పి మరియు వారి సిబ్బంధి అద్వర్యంలో బేగంపేట్ లోని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సిబ్బంధీకి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా టు వీలర్స్, త్రీ వీలర్స్, ట్రాక్టర్లు, లారీలు, కార్లు వాళ్ళు నంబర్ ప్లేట్లు లేకుండా, ఉన్న వాటిని రూల్స్ ప్రకారము నిబంధనలకు అనుగుణంగా అమర్చుకోకుండా వున్న వాహనాలను గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసువారి నుంచి ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునే విధంగా, సగం విరిగిన నంబర్ ప్లేట్లు, అదేవిధంగా నంబర్ ప్లేట్లను విరగ్గొట్టడం, దానికి చీరలు అడ్డు పెట్టడం. లేదా చేతులను అడ్డు పెట్టడం, అదేవిధంగా మాస్కులు అడ్డు పెట్టడం చేస్తున్నారు, అలా చేయడం చట్టరీత్య నేరం అని అన్నారు. అందుకోసం వాహనదారులు క్రమ పద్ధతిలో మోటర్ వాహన చట్టం ప్రకారం సరైన పాంట్ సైజులో నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి. ఇంప్రాపర్ గా నంబర్ ప్లేట్లు అమర్చుకున్న వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సరైన నంబర్ ప్లేట్లు అమర్చడం వలన దొంగతనాలు, నేరాలు నివరించవచ్చుఅని. ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినచో అది చట్టరీత్య నేరమని తెలిపినారు. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్ రోడ్లపై ఎవరూ వాహనం నడపకూడదు. అలా వాహనాలు నడిపినచో 5000 వరకు చలాన్, మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా పొందవచ్చు. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు.మరియు వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు. ఇట్టి కార్యక్రమానికి సుమారు 150 ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీ జి.శంకర్ రాజు, ACP ట్రాఫిక్ శిక్షణా సంస్థ, బేగంపేట్, హైదరాబాద్ తో పాటు శ్రీ చంద్ర శేఖర్, అమర్ ప్రేమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లు మరియు శ్రీకాంత్ సూపర్‌వైజర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *