నగరంలోని స్థానిక 27వ డివిజన్ పరిధిలోని కేశవస్వామి పేట, భగీరధ సర్కిల్, ఉప్పరపాలెం లో శ్రీ భగీరధ మహర్షి వారసులు సగర పుత్రుల ఆధ్వర్యములో విశ్వహిందూ పరిషత్ ద్వారా వచ్చిన అయోధ్యలో శ్రీరామ శిలా పూజిత అక్షతలను రెండు వేల ఇళ్లకు పంపిణి చేశారు. మంగళవారం సాయంత్రం శ్రీ భగీరధ ప్రతిమ దగ్గర నుండి కాషాయ పతాకం చేపట్టి, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ బయలుదేరి స్థానికులకు అయోద్య మందిర చిత్రము, కరపత్రము మరియు అక్షంతలను ప్రతి గృహమునకు చేర్చారు. జనవరి 22 న అయోధ్యలో నిర్వహించు కార్యక్రమాలను వివరించి నాడు ప్రతి ఇంట ఉదయం శ్రీరామ జయరామ జయజయరామ అనే విజయమంత్రం జపించాలని, శ్రీరాములవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అయోధ్య అక్షతలను కుటుంబ సభ్యులందరూ కుటుంబ పెద్దచే తలపై వేయించుకొని ఆశీస్సులు పొందాలని తెలిపారు. మరియు సాయంత్రం ప్రతి ఇంట దీపాలను వెలిగించి అయోధ్య దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో రెడ్డి పరమేశ్వరరావు, జూటూరి శ్రీనివాసరావు, కుంచాల నారాయణ జమ్మిశెట్టి శ్రీనివాసులు దుంపల వెంకట కృష్ణారావు జల శ్రీ మురళీకృష్ణ లంకపల్లి రాఘవేంద్రరావు మందలవరపు రాము, ధనిశెట్టి రామునాయుడు, రాధా రమణ గుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు.


