దర్శిలో బూచేపల్లి ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన రెండో రోజూ అట్టహాసం గా జరిగింది. ఎడ్ల పందేలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైఎస్సార్సీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్ధరెడ్డి మాట్లాడుతూ బూచే పల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడం అభినంద నీయమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్ని కల్లో దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన ప్రజలను మోసం చేస్తున్నాయని, వైసీపీని గెలవలేక వాళ్లు కుయుక్తులు పన్నుతూ బీజేపీని వాడుకుంటున్నారని విమర్శిం చారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మంత్రి మేరుగ నాగార్జున పాల్గొని ఎడ్ల పందేల్లో విజేతలకు బహుమతులు అందించారు. ప్రస్తుతం 17 జతల ఎడ్లు పాల్గొనగా 12 జతల ఎడ్లు పందేల్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన చత్రపతి భీమడోలు ఎడ్లు బలప్రదర్శనలో మొదటి స్థానంలో నిలిచాయి. 3905 అడుగులు లాగి మొదటిస్థానం సాధించాయి. ఈ సందర్భంగా మొదటి బహుమతిని రూ.2 లక్షలు, రెండో బహుమతి రూ.1.60 లక్షలు, మూడో రూ.1.25 లక్షలు, నాల్గో బహుమతి రూ. లక్ష, ఐదో బహుమతి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ఎంపీపీ గోళ్ళపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












