వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ డ్డిలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన ముగ్గుల పోటీలు, 15వ తేదీన ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరిగే ముగ్గుల పోటీలకు మొదటిబహుమతి ఎయిర్ కండీషనర్, ద్వితీయ బహుమతి వాషింగ్ మిషన్, తృతీయ బహుమతి ఫ్రిజ్, నాలుగో బహుమతి ఎల్ ఈడీ టీవీలను బహూకరిం చనున్నారు. ట్రాక్టర్ రివర్స్ పోటీలకు మొదటి బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందజేస్తున్నట్లు వారి ప్రతినిధి సందిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. మహిళలు, రైతులు పోటీల్లో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
బూచేపల్లి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు -14న ముగ్గుల పోటీలు- 15న ట్రాక్టర్ రివర్స్ పోటీలు
13
Jan