దిశను మార్చుకున్న మీచాంగ్ తుఫాన్..
ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం.
రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం…
దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మందపల్లి గ్రామంలో విపరీతమైన ఈదురు గాలులు భారీ వర్షం కురుస్తున్నాయి.
మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత భూమి మీద నిదానంగా ప్రయాణిస్తూ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనుందన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తొలుత అందరూ మచిలీపట్నం వద్ద తీరం దాటింది అనుకున్నారు
కానీ ఇది ఆకస్మాత్తుగా తన దిశ మార్చుకొని నెల్లూరు.. కావలి మధ్యలో తీరం దాటే పరిస్థితి.
*తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు …
మరి కొద్ది గంటల్లో (రాత్రి 12 గంటల నుండి – ఒంటి గంట మధ్యలో ) మైపాడు – రామతీర్థం మధ్యలో (ఊటుకూరు కంచరపాలెం వద్ద) తుఫాన్ తీరం దాటుతుంది. తీవ్రమైన గాలులు ఉంటాయి. (130 – 160 కి మీ ల వేగంతో). ఆ తర్వాత రాత్రి 2 గంటల నుండి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కుండపోత వర్షం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి.