అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

అభివృద్ధి పనులు అన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్ నగర్ నుండి మూడవ సారి భారీ మెజార్టీ తో గెలుపొందిన సందర్భంగా ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ దంపతులు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, లోకనాధం, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో బుద్దా నగర్ కు చెందిన నవ్య, భవాని, గిరి ప్రసాద్, సంపత్, బల్కంపేట కు చెందిన రాజు ముదిరాజ్, గురుమూర్తి నగర్ కు చెందిన శివ, వనం శ్రీను, గాయత్రి నగర్ కు చెందిన వినోద్ తదితరులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సీనియర్ సిటీజన్స్ పార్థసారథి, కృష్ణారెడ్డి, విఠల్ రెడ్డి, వీరారెడ్డి, అరవింద్, మోడల్ కాలనీ సీనియర్ సిటీజన్స్ JST సాయి, వెంకటేశ్వర శర్మ, నాగమణి, సుబ్బారెడ్డి, బన్సీలాల్ పేట డివిజన్ జయప్రకాష్ నగర్, గొల్ల కొమరయ్య కాలనీ లకు చెందిన KM కృష్ణ ఆధ్వర్యంలో పలువురు మహిళలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా రోడ్లు, వాటర్ లైన్, డ్రైనేజీ లైన్ తదితర అభివృద్ధి పనులు నిలిపివేశారని, త్వరలోనే వాటిని తిరిగి చేపడతామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *