పొగాకు సాగు చేస్తూ మిచాంగ్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు వడ్డీలేని రుణంగా పొగాకు బోర్డు రైతు సంక్షేమ నిధి నుండి రూ. 10వేలు మంజూరు చేయనున్నట్లు ఒంగోలు బోర్డు రీజనల్ మెనేజర్ లక్ష్మణరావు తెలిపారు. దక్షణ ప్రాంత తేలిక మరియు నల్ల రేగడి నేలలలో మిచాంగ్ తుఫాన్ వల్ల పంట దెబ్బతిన్న రైతులు ఆ జాబితాలో నమోదు అయి ఉండాలని, రైతు సంక్షేమ నిధి సభ్యులు అయి ఉండి అటువంటి అర్హత ఉన్న రైతులకు సంబంధిత బోర్డు వేలం అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హలైన రైతులు ఉపయోగించుకోవాలని ఆర్ఎం లక్ష్మణరావు కోరారు.
పొగాకు సాగు రైతులకు వడ్డీలేని రుణంగా పది వేలు
07
Jan