భాజపా నార్త్ ఇండియన్ సెల్ జిల్లా కన్వినర్ గా విజయ్ మోడీ నియామకం.పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి -బిజేపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి పిలుపు

రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో బిజెపి బలోపేతం కోసం కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు పార్టీ బాధ్యతల లో యువతకు ప్రాధాన్యతనిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లా నార్త్ ఇండియన్ సెల్ కన్వినర్ గా విజయ్ మోడీ ని నియమించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మన ప్రధాని చేసే ప్రతి ఒక్క ప్రజాభివృద్ధి పథకాలను, ఆయన విధానాలను జిల్లా లోని నార్త్ ఇండియన్స్ కి తెలిపే విధముగా కృషిచేయాలని, ఆ పథకాలను వారికి తెలిపి వారిచే ధరఖాస్తు చేయిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచే విధముగ విస్తృతంగా పనిచేయాలని, రానున్న ఎన్నికలలో బిజేపి గణనీయమైన విజయం సాధించి, రాజ్యాధికారం చేపట్టు విధముగ అందరినీ కలుపు పోవాలని విజయ్ ను అభినందించారు. ఈ మేరకు పార్టీకార్యాలయములో నియామక పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భముగా శక్తివంచన లేకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టి బలోపేతానికి కృషిచేస్తానని విజయ్ మోదీ తెలిపారు. జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఐటీ సెల్ జిల్లా కన్వినర్ గుర్రం సత్యనారాయణ, మరియు జిల్లా కార్యదర్శి బసినేపల్లి రాజశేఖర్ పాల్గోనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *