వందల సంవత్సరాల క్రితం మహమ్మదీయుల ఆక్రమణలతో వారి దుశ్చర్యలతో నేలమట్టమైన అయోధ్య శ్రీ రామ మందిరం వందలాదిమంది కరసేవకుల పోరాటం మరియు న్యాయ సమ్మతమైన తీర్పుతో అయోధ్య శ్రీ రామ జన్మభూమిని సాధించుకోవడం జరిగినది శ్రీ రామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ నేతృత్వంలో హిందువుల ఏకైక స్వప్నాన్ని సహకారం చేసే దిశగా కృషిచేసి అత్యంత సుందరమైన, అభేద్యమైన, భవ్య, దివ్య శ్రీ రామ మందిరాన్ని నిర్మించి ఈనెల 22న భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ చేతుల మీదుగా ప్రారంభం జరుపుకుంటున్న శుభ సందర్భంగా అయోధ్యలోని రామ శిలాస్పర్సిత అక్షంతలను, శ్రీ రామ మందిర ఆహ్వాన పత్రిక ప్రతి ఇంటికి చేర్చాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉన్నతమైనది, ప్రతి ఒక్క భారతీయుని ఇంట శ్రీరామ మందిరం చిత్రం ఉండాలని, శ్రీరాములవారి ఆశీస్సులు లభించాలని అక్షతలను పంపడం, ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం తో మా జన్మ ధన్యమైనదని భావిస్తున్నామని వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మద్దు అరవింద్ లక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.
స్థానిక విశ్వహిందూ పరిషత్ వారి నుండి వచ్చిన అక్షంతలను స్వీకరించి తమ పరిధిలోని గృహాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అరవింద లక్ష్మీ మాట్లాడుతూ… శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో చంద్రునికో నులిపోగులాగా పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో అక్షింతలను వృద్ధి చేసుకొని 22వ తేదీ వరకు ఈ అక్షంతలను పూజా మందిరంలో ప్రతిష్టించుకుని శ్రీరామ జయ రామ జయజయ రామ అనే మహా మంత్రాన్ని జపిస్తూ పూజించుకొని అయోధ్యలో ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటిలోని ప్రతి ఒక్కరూ అక్షింతలను తలపై చల్లుకొని మిగతా వాటిని తమ ఇంట జరిగే శుభకార్యాల నందు వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మద్దు అరవింద లక్ష్మీ, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ కార్యదర్శి భూమా శ్రీనివాసులు, బిజెపి నాయకులు గుర్రం సత్యనారాయణ, గీతా పరివార్ సభ్యులు చీమకుర్తి శివప్రసాద్, తాతా శ్రీనివాసులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



