ఎబీసీలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు- విద్యార్థులు అల్ రౌండ్ డవలప్ మెంట్ చెందటమే నిజమైన పురోభివృద్ధి -ఎంపీడీఓ కెవై కీర్తి, ఎంఈఓ -2 సుధాకర్ రావు – ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేత -విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

పండుగంటే ముచ్చట్లు … మురిపాలు.. బంధువులు, పిండి వంటలు… విందులు.. వినోదాలు . అచ్చ తెలుగు సంబరాల్లోని అసలు సిసలు మజా ఆస్వాదించారు ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు. రంగుల ముగ్గులు, ఆముగ్గులపై గొబ్బెమ్మలు, బోగి మంట, ఆ మంట చుట్టూ నృత్యాలు… పెద్దలు. అధికారులు సైతం సాంప్రదాయ బద్దమైన నృత్యంలో లీనం కావటంతో ఆనందం మరింత రెట్టింపైనది .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలో ఎబీసీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించే పలు కార్యక్రమాలు విద్యార్థులు… అధ్యాపక .. అధ్యాపకేత సిబ్బంది ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. ఎబీసీ ప్రధానోపాధ్యాయుడు కె . వెంకటేశ్వరరావు ఆధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ కె వై కీర్తి, ఎంఈఓ – 2 సుధాకర్ రావులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కె.వై కీర్తి మాట్లాడుతూ …విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందటమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. చక్కగా చదివి రాణించాలని కోరారు. ఎంఈఓ – 2 సుధాకర్ రావు మాట్లాడుతూ …విద్యార్థులకు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించేందుకు ఎబీసీ యాజమాన్యం మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ …పండుగ ప్రాధాన్యతను తెలుసుకుని సంప్రదాయ బద్దంగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… విద్యార్థులకు పండుగ ప్రాధాన్యతను తెలిపేందుకు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించామని చెప్పారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ఎబీసీ హైస్కూల్ పొత్సహిస్తుందని చెప్పారు. ముందుగా బోగి మంటలు వేసి సంక్రాంతి పాటలకు సాంప్రదాయ బద్దగా కోలాటం ఆడారు. ఎంపీడీఓ కెవై కీర్తి విద్యార్థులతో కోలాటం ఆడి విద్యార్థులను ఉత్సాహపరచారు. చిన్నారులకు భోగి పండ్లతో స్నానం చేయించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించారు.
ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీడీఓ కెవై కీర్తి, ఎంఈఓ-2 సుధాకర్ రావు, కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె .వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె. కాలేషాబాబు, రిటైర్డు ఉద్యోగుల సంఘం బాధ్యులు ఐ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *