హైకోర్టు తీర్పుతో ఎస్సీ రైతుల భూములకు రక్షణ

ప్రభుత్వం అందజేసిన డీకే పట్టా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న అగ్రవవర్ణాల నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దర్శి డీఎస్పీ అశోకవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు రక్షణ కల్పించే చర్యలు చేపట్టారు. డీఎస్పీ గురువారం దారం వారిపాలెంను సందర్శించి హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన భూ యజమాని నూకతోటి గోవిందమ్మ, కుటుంబీకులతో మాట్లాడారు. ప్రభుత్వం దారంవారిపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 102/1లో2 ఎకరాల 50సెంట్ల భూమికి డీకే పట్టా ఇచ్చింది. సదరు భూమిని 2020లో తూరకపాలెం గ్రామానికి చెందిన కుమ్మిత శివారెడ్డి దున్నుతుండగా తమ భూమిలో ఎందుకు దున్నుతున్నారని గోవిందమ్మ, కుటుంబీకులు ప్రశ్నించగా శివారెడ్డి, భార్య విజయ వారిని కులంపేరుతో దూషించారు. ఈమేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదయింది. తమకున్న హక్కుల మేరకు గోవిందమ్మ కుటుంబీకులు పొలం దున్నేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గోవిందమ్మ తన భూమిలోకి వెళ్లకుండా అగ్రవర్ణాలు అ డ్డుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం గో విందమ్మకు ఆ భూమి విషయంలో పూర్తి హక్కులు ఉన్నందున ఆ భూ మిలోకి వెళ్లేందుకు భూహక్కుదారులు అడ్డుకోండా చూడాలని, భూమిని సాగు చేసుకునేందుకు పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పించాలని ఉత్తర్వు లు జారీ చేసింది. హైకోర్టుఉత్తర్వుల మేరకు డీఎస్పీ అశోకవర్ధన్ పొలం వద్దకు వెళ్లి గోవిందమ్మ, కుటుంబీకులతో మాట్లాడారు. పొలంను సాగు చేసుకోవాలని, ఎవరైనా అడ్డు వస్తే తమకు చెపితే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ  రమణయ్య ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *