జగనన్న ఆశీస్సులే శ్రీరామరక్ష -జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులే తమ కుటుంబానికి శ్రీరామరక్ష అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని ఉమామశ్వరపురంలో బీసీలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వారు బుధవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బూచేపల్లి వెంకా యమ్మ, శివప్రసాదరెడ్డిలు మాట్లాడుతూ తమ కుటుంబంపై ఉన్న నమ్మకంతో దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ జగనన్న నియమించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. జగనన్న ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజలకు సేవచేసుకునే అవకాశం దక్కిందన్నారు. ఇరవై సంవత్సరాలుగా బూచేపల్లి కుటుంబం దర్శి నియో జకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజ
లకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రత్యేకంగా ఉమామహేశ్వరపురంతో తమ కుటుంబానికి విడదీ యరాని సంబంధం ఉందన్నారు. సాగర్ జలాల కోసం నిత్యం రైతుల పక్షాన నిలబడి వారికి అండగా నిలిచామన్నారు. గతంలో ప్రతి ఎన్నికలోనూ ఐదు వందల మెజార్టీతో తమకు అండగా నిలిచిన గ్రామస్తులు ఈసారీ 700 మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలని అభిమానులను, కార్యకర్తలను, పార్టీ శ్రేయోభిలాషులను కోరారు. వైస్ ఎంపీపీలు వేముల పద్మాజానకిరామయ్య, బంకా రమణమ్మ నాగిరెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, సర్పంచ్ వేముల పద్మావతి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ సంఘ మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, నాయకులు మేకల వెంకటేశ్వరరెడ్డి, చింతల అంజిరెడ్డి, కోటిరెడ్డి, నాగూర్మీరావలి, ఇరుగుల కొండారెడ్డి, అబ్బని అంజిరెడ్డి, యర బ్రోలు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుజ్జుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *