- పలువురి అభినందన.
- అధిష్టానం ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నా -ధనిశెట్టి రామునాయుడు.
భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ధనిశెట్టి రామునాయుడు కి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాము నాయుడు మాట్లాడుతూ… భాజపా జిల్లా మీడియా ఇన్చార్జిగా మరో మారు అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను మరియు కార్యకర్తలను అనుసంధానం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలిసే విధంగా పని చేస్తున్నానని, నాకు సపోర్టుగా నిలచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారుకి చేరే విధంగా స్థానిక మండల అధ్యక్షులతో మాట్లాడుతూ ఆయా పరిధిలోని నాయకులతో సంప్రదింపులు జరుపుతూ వివిధ కార్యక్రమాలను నిర్వహించామని, బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సుకన్య ఖాతాలను తెరిపించడం, ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్ ఇప్పించడం, ఇలా పలు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, పలు సామాజిక సమస్యలను మీడియా ద్వారా, ఉత్తరాల ద్వారా ప్రభుత్వానికి తెలుపుతూ ఉన్నామని తెలిపారు. నా ద్వారా వెళ్లిన సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రచురించి ప్రచారం చేసి ప్రజలకు తెలిసే విధంగా సహకారం అందించినందుకు మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని, మహిళామోర్చా నగర అధ్యక్షురాలు అర్ధాంగి ధనిశెట్టి పావని తో పార్టీ బలోపేతానికి మా ఇంటి నుండి ఇద్దరం పనిచేయడం గర్వకారణమన్నారు.

