ఆదరించండి.. అండగా ఉంటాం! -జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డి -ఇంటింటి ప్రచారానికి పులిపాడులో అనూహ్య స్పందన

ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే బూచేపల్లి కుటుంబం మీతో ఉంటూ అన్ని వేళలా
అండగా ఉంటుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి
నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని పులిపాడులో
గురువారం మన ఊరికి..మన శివన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం ప్రారంభిం
చారు. దర్శి నుంచి భారీ బైక్ ర్యాలీతో గ్రామానికిచేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.గ్రామంలోని కొత్తూరు, పాతూరు రామాలయాలు, పీర్ల చావిడి వద్ద ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లోకార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులతో కలిసినడిచి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరినిఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బూచేపల్లి కుటుంబానికి పులిపాడుతో విడదీయలేని సంబంధంఉందన్నారు. తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డిఎన్నికల ప్రచారం పులిపాడు నుంచి ప్రారంభించివిజయం సాధించినట్లు శివప్రసాద్ రెడ్డి గుర్తుచేశారు. గతంలో తననూ అదే తరహాలో గెలిపించారని చెప్పారు. గ్రామానికి చెందిన యాదాలకాశిరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇరవై వేల నగదునుఆర్థిక సహాయంగా అందజేశారు. ఎస్సీ కాలనీకిచెందిన అంగవైకల్యం గల బొందలపాటిలాజర్ ను ఆప్యాయంగా పలకరించి అతడిసమస్యలు అడిగి తెలుసుకున్నారు. తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, భార్య నందిని, కుమారుడు విధ్యాధర్డ్డిలతో కలిసి గడప గడపకు వెళ్లి ఆప్యాయంగాపలకరించారు. మధ్యాహ్నం పులిపాడులో అన్నదానం చేశారు. జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు,వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల పార్టీ మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ల సంఘ మండల మాజీఅధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, పులిపాడుసర్పంచ్ ముక్కమళ్ల శ్రీనివాసరెడ్డి, నాయకులుబిజ్జం కృష్ణారెడ్డి, మేకల వెంకటేశ్వరెడ్డి, కానాల
రవికుమార్రెడ్డి, ముక్కమళ్ల రమణారెడ్డి, ఏరేసిరమణారెడ్డి, కుంటా అచ్చారావు, సానికొమ్మురాజశేఖరరెడ్డి, ఆవుల నాగేశ్వరరావు, ఏటి మల్లె పుకొండ, మేకల చెంచయ్య, భిక్షాలురెడ్డి, గొంది వెంకటప్పారెడ్డి, మేడగం వెంకటరమణారెడ్డి, కోదండరామయ్య, మందలపు అశోక్, చింతల కోటిరెడ్డి, జనమాల పిచ్చయ్య పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *