హైదరాబాద్ నగరం లో గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం వల్ల బేగంపేట విమానాశ్రయం సమీపం లోని ఐ బీ పి పెట్రోల్ పంపు ముందు వర్షం నీరు భారీగా నిల్చి పోయింది.ఇదే ప్రాంతం లో ప్రకాష్ నగర్ ఫ్లై ఓవర్ వుంది.సాయంత్రం మాదాపూర్ .హైటెక్ సిటీ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ట్రాఫిక్ వర్షం నీరు నిలిచిపోవడం తో ట్రాఫిక్ మెల్లగా సాగింది.కొన్ని వాహనాలు ఫ్లై ఓవర్ పై నుంచి రాకపోకలు సాగించగా బస్సులు తది తర వాహనాలు ఫ్లై ఓవర్ కింది నుంచి రాక పోకలు సాగించాయి. ఈ సమయం లో పెట్రోల్ పంపు ముందు వర్షపు నీరు నిల్చి పోయి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నా విషయం తెలుసుకున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సీ పీ జీ.శంకర్ రాజు ట్రాఫిక్ సిబ్బంది తో ఆ ప్రాంతానికి చేరుకుని వర్షం నీటిని నాలా లోకి సాఫీగా వెళ్ళేలా చేశారు.దీంతో రోడ్ పైన నిలిచి పోయిన వర్షం నీరు మొత్తం నాలా లోకి వెళ్లి పోయింది.దీంతో ఆ ప్రాంతం లో ట్రాఫిక్ యధావిధిగా కొనసాగింది.నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సీ పీ వారి సిబ్బంది సకాలం లో స్పందించి రోడ్ పైన నిల్చిన నీటిని తొలగించి వాహన దారుల ప్రయాణం సాఫీగా సాగేలా చేయడం పట్ల వాహన దారులు సంతోషం వ్యక్తం చేయడం తో పాటు ట్రాఫిక్ పోలీస్ లను అభినందించారు.

