కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ,విద్యావతి దంపతులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పలువురు ఆకాక్షించారు.జంపన దంపతుల 42 వ వివాహా మహోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భముగా న్యూ సిటీ కాలనీ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. బాపూజీనగర్ లోని శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వివాహ మహోత్సవం పురష్కరించుకుని పలువురు ప్రతాప్ విద్యావతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అవధులు లేని అనురాగా లతో ఈ అనుబంధం వందేళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని జంపన మిత్రులు శ్రేయోభిలాషులు వారికి అభినందనలు తెలిపారు.

