రైల్వే ప్రయాణీకుల అదనపు
రద్దీనీ నివారించేందుకు చేపట్టిన చర్యలు భేష్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
దక్షిణమధ్య రైల్వే ప్రయాణీకుల అదనపు రద్దీ నీ నివారించేందుకు చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల
- హైదరాబాద్ నగరం నుంచి
(మే 9 నుండి 12 వ తేదీ) వరకు అస్ రిజర్వ్ విభాగంలో సుమారు 4. 3 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు రైల్వే అధికారులు తెలియ జేశారు.
వేసవి సెలవులు ప్రారంభం కావడం, పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ మరియు వారాంతపు రద్దీ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత వారంలో , 9 నుండి 12 వరకు ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ప్రజలు వారు కోరుకున్న ప్రదేశాలకు ప్రయాణించడం భారీగా పెరిగింది. జంట నగరాల్లోని సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుండి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు భారీ రద్దీని ఊహించి ప్రణాళికా బద్దమైన చర్యలు చేపట్టి రైలు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించదం తో పాటు ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించారు.
మే 9 నుండి 12 వ తేదీ వరకు జంటనగర ప్రాంతంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ మరియు లింగంపల్లి మొదలయిన రైల్వే స్టేషన్ల నుండి వివిధ గమ్యస్థానాలకు సుమారు 4.3 లక్షల మంది అన్ రిజర్వుడు ప్రయాణికులు ప్రయాణించారు. జంట నగరాల ప్రాంతం నుండి జనరల్ కోచ్‌లలో సగటున 1.05 లక్షల మంది ప్రయాణించారు. ఇది రోజువారీ సగటు 68, 800 మంది అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికులతో పోలిస్తే 52శాతం ఎక్కువ.
దక్షిణ మధ్య రైల్వే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 60 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను ఇరువైపులా వచ్చే ట్రాఫిక్ కి అనుగుణంగా నడిపించారు. ఈ ప్రత్యేక రైళ్లు 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. జంటనగర ప్రాంతం నుండి కాకినాడ, విశాఖపట్నం, నర్సాపూర్, నాగర్సోల్ , మచిలీపట్నం మొదలైన ప్రముఖ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు కూడా నడిపారు. అదనంగా, జంట నగరాల నుండి ఖుర్దా రోడ్, బెర్హంపూర్, బెంగళూరు, సంబల్పూర్, దానాపూర్ , గోరఖ్పూర్, అగర్తలా , రక్సాల్ , ఉదయపూర్, కటక్, సంత్రాగచ్చి, కొల్లాం, జైపూర్, రాజ్కోట్, మొదలైన దూర ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఈ కాలంలో వెయిట్‌లిస్ట్ లో ఉన్న ప్రయాణీకుల అదనపు రద్దీకి అనుగుణంగా , AC III టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన 41 అదనపు కోచ్‌లు, 40 రోజువారీ రైళ్ళకు జోడించారు.
ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి చేపట్టిన చర్యలు
రద్దీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కమర్షియల్ , సెక్యూరిటీ మరియు ఆపరేటింగ్ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయానికి మరియు డివిజన్ లకు చెందిన అధికారులు స్టేషన్లలో నిరంతరం పర్యవేక్షించారు.
ప్రత్యేక రైళ్ల గురించి తరచుగా ప్రకటనలు చేయడం.
ఎలక్ట్రానిక్ బోర్డుల ద్వారా సమాచారాన్ని ప్రదర్శించడం
ప్రయాణీకులకు వారి సంబంధిత రైళ్లకు అనుగుణంగా మార్గనిర్దేశం చేయడం.
యూటీస్ మొబైల్ యాప్, ఏ. టి. వి. ఏం లు, కొ టి. వి. ఏం. లను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడం
ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు.
ఈ సమాచారాన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్ల ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
అదనంగా క్యాటరింగ్ ఏర్పాట్లు చేశారు.
ఆరు డివిజన్లలోని అన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లు ప్రధాన కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులద్వార అందుబాటులో ఉండి రైళ్ల సజావుగా నడపడానికి నిరంతరం పర్యవేక్షించారు .


