శీలం ప్రభాకర్ కు ఘనంగా నివాళి……………..

మాజీ టి పి సి సి కార్యదర్శి రాంగోపాల్ పేట్ మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ కు పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు.శీలం ప్రభాకర్ 61వ జయంతి సందర్భంగా పాన్ బజార్ లోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు శీలం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేలం ప్రభాకర్ పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించారని ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారని అన్నారు. ఎమ్మెల్యే తనయుడుగా కార్పొరేటర్ గా ఉండి కూడా తన జీవితకాలం ప్రజలకు సేవలందించారని కొనియాడారు. అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి తక్కువ వయసులోనే అందరికీ దూరం అవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా శీలం కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *