రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు -ప్రకృతి వ్యవసాయజిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి

వ్యవసాయంలో మారుతున్న వాతావరణ మార్పులకు అను గుణంగా రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు సాధించేందుకు రైతులు సహకరిం చాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. సుభాషిణి అన్నారు. తాళ్లూరు మండలం లోని నాగంబొట్లపాలెం రైతు సేవాకేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న రైతులకు అవసరమైన డ్రమ్ములు, టార్పాలిన్ పట్టలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. సుభాషిణి మాట్లా డుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నా మని, రైతులు కనీసం అర ఎకరా నుంచి 10 ఎకరాల వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. ఈ ఖరీఫ్ సీజ న్లోనే జిల్లాలో పది వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భూమి, నీరు, వాతావరణం, మంచి భవిష్యత్ కు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మేలు చేస్తా యన్నారు. నేలలు సారవంతం చేసేందుకు పచ్చిరొట్ట ఎరువులు, ఘన, జీవామృ తం ,తెగుళ్ల నియంత్రణకు వివిధ కషాయాలుతయారు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సీఆర్పీలు, ఐసీఆర్పీలు జిల్లా వ్యాప్తంగా 250 మంది రైతులకు సల హాలు, సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ …తాళ్లూరు మండలంలో 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినట్లు- చెప్పారు. కౌలు రైతులు సాగు ధ్రువీకరణ కార్డులు తీసుకోవాలన్నారు. రాయితీపై ఇస్తున్న కందులు, వడ్లు ను రైతులు తీసుకో వాలన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహాయ సహకారాలు, మెళకువలు నేర్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సీహెచ్ సుబ్బారావు ప్రకృతి వ్యవసాయ ఇన్ చార్జిలు నరసింహులు, ప్రభాకర్, వీఏఏ-1 శ్రీను, ఏఈఓ నాగరాజు, సీఆర్పీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *