బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాడమాస బోనాలు ఉత్సవాలను ఈనెల 28న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఘటం ఊరేగింపు కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా అమ్మవారి ఆలయంలో ప్రారంభిస్తున్నామని ఆలయ నిర్మాణ దాత విశాల్ సూథం తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఘటం ఊరేగింపు ప్రారంభమై ప్రకాష్ నగర్ కాలనీ మీదుగా సాగి చివరకు ఆలయానికి చేరుకుంటుందన్నారు. అనంతరం భక్తులకు హారతి అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ ఇళ్ల వద్దకు వచ్చిన అమ్మవారి ఘటానికి పసుపు, కుంకుమ లు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలకాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు అమ్మవారి ఘటం వారి ఇళ్ళ ముందుకు వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకుని తరించాలని కోరారు. ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాడమాస బోనాలు ఉత్సవాలను 28వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణదాత విశాల్ సూద్దాం, ఈవో విట్టలయ్య లు తెలియజేశారు 28న ఉదయం ఐదు గంటలకు అమ్మవారి మూల విరాట్ కు పంచామృత హరిద్రోదక కుంకుమ సహిత అభిషేకం ప్రారంభిస్తారన్నారు. ఆరు గంటలకు నూతన నూతన వస్త్రాలంకరణ .7:00కు అమ్మవారి అర్చనలు భక్తులచే బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం మహా మంగళహారతులు ,సాయంత్రం 6:30 కు తొట్టెల మరియు పోతురాజులు విన్యాసాలు జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు .29న రంగం కార్యక్రమం నిర్వహించనున్నమని అనంతరం గావు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

