వర్షాలు నేపథ్యంలో ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలి…… ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్……

హైదరాబాదు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు.
ఆదివారంఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లోనీ మానసరోవర్ సాయి సాగర్ ఎంక్లేవ్ మెయిన్ రోడ్లో కొత్తగా నిర్మించిన బాక్స్ నాలాను ముద్దం నరసింహ యాదవ్ పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భారీ వర్షాల కారణంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని మాన సరోవర్ సాయి సాగర్ ఇంక్లేవ్ మెయిన్ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుండి భారీ వర్షాలకు అల్వాల్ నుండి వచ్చే వరద నీరుతో కాలనీవాసులు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారని,
కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు చొరవతోనిధులు తీసుకొచ్చి (8.5 కోట్లతో బాక్స్ నాలా నిర్మించి వర్షం నీరు బయటికి వెళ్లే మార్గం ఏర్పరిచినారన్నారు.
ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షం వలన కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేవనిసాయి సాగర్ ఎంక్లేవ్ కాలనీవాసులు ఎమ్మెల్యే కృష్ణారావు కు ధన్యవాదాలు తెలిపాలన్నారు.తమ కాలనీ అభివృద్ధికి అన్ని వేళలా అండగా నిలిచిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోకాలనీవాసులు కేపీ అనిల్
ప్రకాష్ బండారి ప్రదీప్ భార్గవ్,మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్, గడ్డం నర్సింగరావు , బుర్రి యాదగిరి , పోచయ్య, దేవేందర్ ,లింగం, వెంకన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *