జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే వైద్యులని, అయితే కొందరు ఆ వృత్తిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జర్నలిజం వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని.. అలాగని పార్టీ కార్య కర్తల్లా వ్యవహరించొద్దని సూచించారు. ఆదివారం రవీంద్రభారతిలో జేఎన్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు పేట్‌బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత పత్రం (మెమో)ను ముఖ్యమంత్రి అందజేశారు. మరణిం చిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాజకీయ పార్టీలే ప్రస్తుతం పత్రికలు నడుపుతున్నాయని, అందులోని జర్నలిస్టులు కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విదానానికి స్వస్తి పలకా ల్సిన బాధ్యత నిజమైన జర్నలిస్టులపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు జర్నలి స్టులు వెళ్లలేకపోయేవారని, ప్రస్తుతం చిట్ చాట్ జరిపే పరిస్థితి ఉందని గుర్తుచేశారు. 18 ఏళ్లుగా జటిలంగా మారిన జేఎన్ జే హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల సమ స్వకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపిందని చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తా మని, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు అందిస్తామని సీఎం అన్నారు. ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎవడు పడితే వారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సీఎం సూచించారు. పత్రిక, ఛానల్, సీనియారిటీ ప్రాధాన్యం ఆధారంగా ప్రజాప్రతినిధులను కలిసేందుకు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు నిబందనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, పెద్ద పత్రికలను ఎలా గుర్తించాలో ఒక నివేదిక తయారు చేయాలన్నారు. ప్రెస్ అకాడమీకి ప్రత్యేక నిధి కింద రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి.. విధివిదానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మిగతా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల
స్థలాలు ఇస్తామన్నారు.
*జర్నలిస్టులను కోటీశ్వరులను చేశాం: పొంగులేటి*
రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల చిరకాల వాంఛను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ‘ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా 1166 మందిని కోటీశ్వరులను చేసినం దుకు సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలవాలంటి నెలలు పట్టి సందర్భాలుండేవి. ప్రశ్న అడిగితే వెటకారంగా సమాధానం వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఖమ్మం వరదలపై ప్రతిపక్షాలు బురద
రాజకీయాలు చేస్తున్నాయి. హైడ్రాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’ అని విమర్శించారు. రవా ణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారు చూపిందన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం రేవంత్ రెడ్డి కృషితో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ అంశం ఓ కొలిక్కివచ్చిందని చెప్పారు. మండల, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివా స్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టు హెల్త్ కార్డ్స్ నిమ్స్ లో వర్తిస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో తీసుకోవడం లేద న్నారు. ఈ పథకం కింద సులభతరంగా వైద్యం అందేలా విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రిని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిహ్యటీ మేయర్ శ్రీలత, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
