నైపుణ్య అభివృద్ధి మరియు ఔత్సాహిక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జన శిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో తాళ్లూరు మండలం లక్కవరం గ్రామం ఎస్సీ కాలనీలో డ్రెస్ మేకింగ్ శిక్షణ ప్రారంభించబడినది. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సౌజన్యంతో జన శిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్, ప్రోగ్రాం ఆఫీసర్ కే.శ్యాం సునీల్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో మహిళలు తప్పకుండా ఏదో ఒక వృత్తి శిక్షణ నైపుణ్యం ద్వారా వారు ఎంచుకున్నటువంటి వృత్తి యందు మెలుకుల నేర్చుకొని తద్వారా స్వయం ఉపాధి పొందవచ్చునని ఆయన అన్నారు. దళిత బహుజన రిసోర్స్ రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ జన శిక్షణ సంస్థాన్ మహిళలకు, గృహిణిలకు వివిధ రకాల వృత్తి,విద్య,శిక్షణ కార్యక్రమాల ద్వారా వారిలో నైపుణ్యము లను కల్పించి తద్వారా వారు స్వయం ఉపాధి వైపు పయనించవచ్చునని అన్నారు . ఈ కార్యక్రమంలో లక్కవరం గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఎన్. కోమలి మాట్లాడుతూ మహిళలు ఆధునిక కాలంలో ఏదో ఒక వృత్తి విద్య నందు శిక్షణ పొందాలని,ఇలాంటి శిక్షణ ఇచ్చే సంస్థ ల శిక్షణల పొంది వాటిని సక్రమంగా ఉపయోగించుకొని ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక స్వాలంబనవైపు పయనించాలని ఆమె అన్నారు . ఈ కార్యక్రమంలో శిక్షకురాలు టి నాగ లక్ష్మి శిక్షణ పొందుతున్న మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
