వైభవంగా గణనాథుల నిమజ్జనం

తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారి పాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు, ఎంపీపీ తాటికొండ శ్రీనివా సరావు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్ రెడ్డి, మానం రమేష్ బాబు శాగం కొండా రెడ్డి, గొల్లపూడి వేణుబాబు, కాలేషావలి, కె. రామయ్య, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. శని వారం రాత్రి వినాయకస్వామి వద్ద ప్రసాదంగా ఏర్పాటుచేసిన లడ్డూలను వేలంపాట నిర్వహించారు. ఆయా విగ్రహ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ఎస్. మల్లికార్జునరావు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వ హించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *