పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న సోమవరప్పాడుపరిధిలో ని గుంటిగంగ సన్నిధిలోగల గుంటి గంగాభవానీ తల్లికి ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పలుప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి కరుణించమని వేడుకున్నారు. తాళ్లూరు పరిసర మండల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ బ్రాహ్మణఅర్చకులు ఎన్.కా మేశ్వరశర్మ, పూజారులు ప్రకాశ్ పంతులు, బాలరా జులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్ర మంలో ఈవో పి.కార్తిక్ ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
