ఎన్ బి టి నగర్ బస్తి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా……. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని…………………..

ఎన్ బి టి నగర్ బస్తీ అభివృద్ధి కి తనవంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బేగంపేట డివిజన్ లోని ఎన్ బి టి నగర్ పాటిగడ్డ బస్తీ కి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శేఖర్ ముదిరాజ్ సోమవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బస్తీ ప్రజల తో కలిసి వెళ్లి వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. శేఖర్ ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బస్తీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేగంపేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు అఖిల్, రఫిక్, ఆరీఫ్, ఇలియాజ్, సిద్దిక్, నసీమా ఫా, శారద, అమ్ములు, షెన్ను తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *