తాళ్లూరు తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి

తాళ్లూరు తహసీల్దార్ గా కె. నాగలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేయుచున్న పి.సింగారావును బాపట్ల జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లానుండి తాళ్లూరు తహసీల్దార్ గా కె.నాగల క్ష్మిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా తహసీల్దార్ నాగలక్ష్మి మాట్లాడుతూ… తహసీల్దార్ కార్యాలయంకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే నేరుగా తమ దృష్టికి తీసుక రావాలన్నారు. ప్రజలకు పారదర్శకంగా పని చేయటం జరుగు తుందన్నారు. ప్రజల రెవెన్యూ సంబంధ సమస్యలు ఉంటే కార్యాలయంకు వచ్చి పనులు చేయించుకోవాన్నారు. కార్యాలయ సిబ్బంది తహసీల్దార్ కు బొకే అందజేసి అభినందనలు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ , సీనియర్ అసిస్టెంట్ పిఎస్ఆర్ మూర్తి, ఎలక్షన్ సి.వో సుజాత, సిబ్బంది అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *