తెలంగాణ బాషా సాంసృతిక శాఖ, సూపధా క్రియేషన్స్ నిర్వహణలో రూపొందించిన బతుకమ్మ సంబురాలు వీడియో పాటను సాంసృతిక , పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్ తన ఛాంబర్ లో శనివారం విడుదల చేశారు .
ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మాట్లాడుతూ ….బతుకమ్మ అంటే ప్రకృతికి థాంక్స్ గివింగ్ అంటూ పూలనే దేవతలుగా పూజించే ఇలాంటి పండుగ ఎక్కడ లేదని, తెలంగాణాలో ని ప్రతి పల్లె పూల తెరులై ఆడుతుందని కొనియాడారు .ఈ పాట చిత్రణ బాగుందని మెచ్చుకున్నారు . పాటను గాయని ఎం ఎల్ శృతి ఆలపించగా, సాహిత్యం డా తంగిళ్ల శ్రీదేవి రెడ్డి , సంగీతం ఎం. ఎం. శ్రీలేఖ సమకూర్చగా, నాగదుర్గ, వీణా, స్వాతి బృందం ఎంతో చక్కగా ఈ పాటలో అభినయించారని సాంసృతిక శాఖ సంచాలకుడు డా మామిడి హరికృష్ణ కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర , డైరెక్టర్ చేతన్ , డీవోపీ సమకూర్చిన తిరుపతి , రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

