తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా రామాలయంలో బాలికలు
అన్న పూర్ణాదేవి వేషధారణ వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జోషికా సాయిశ్రీ, శ్రీ వైష్ణవి, చంద్రకళ, సాయి సౌమిత్రి, మౌన చిన్నారులు అన్నపూర్ణాదేవి అవతారంలో అందరికీ అన్నం పెట్టే రైతు పండించే ధాన్యపు పంటను చేత పట్టుకొని దేవాలయంలో పూజలు నిర్వహించారు. చిన్నారుల అన్నపూర్ణాదేవి అలంకరణ అందరిని ఎంతగానో ఆకర్షించింది. కార్యక్రమంలో పోలంరెడ్డి పద్మావతి, విజయలక్ష్మి, కోట్ల సంధ్యారాణి, పూజారి గోసుకొండ శ్రీనివాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



