తాళ్లూరు మండలంలో స్కూల్ కాంప్లెక్స్ లు మూడు కాంప్లెక్స్ లు గా కొనసాగించాలని ఎపీటీఎఫ్ తాళ్లూరు మండల శాఖ గౌరవ అధ్యక్షుడు పొలం రెడ్డి సుబ్బా రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, నారిపెద్ది శ్రీనివాస రావులు కోరారు. పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, సచివాలయాల సంఖ్య నిబంధనాల ప్రకారం రెండు మాత్రమే కొనసాగించాల్సి వస్తే మారుమూల ప్రాంతమైన బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఎపీటీఎఫ్ తాళ్లూరు మండల శాఖ కోరారు.
