9,99,999. 99 లక్షల రూపాయలతో మహాలక్ష్మిగా వాసవిమాత -ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అక్టోబరు 8వ తేది మంగళవారం ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి “మహాలక్ష్మి దేవి” గా భక్తులను అనుగ్రహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి శ్రీ సూక్త సహితంగా ఆవుపాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారు 9,99,999.99 (తొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభైతొమ్మిది రూపాయలు) రూపాయల అలంకరణ తో మహాలక్ష్మి గా దర్శనమిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆలయ అర్చకులు శర్మ, సాయి ఉభయ దాతలచే ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహింప చేశారు. బండేపల్లి వెంకటేశ్వర శాస్త్రి అమ్మవారిని అత్యంత సుందరముగా అలంకరించారు. సాయంత్రం జరిగిన గుడి ఉత్సవంలో శ్రీ వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాటం భక్తి యుతంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తదాత్మ్యం చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *