సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు……శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు……రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ఆలయ వీధుల అలంకరణ………….

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం లో ఆలయ ఈ ఓ వంగా అంభుజా,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.అలయ ప్రాంగణం లో వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు.ఆలయ ప్రాంగణం తో పాటు ఆలయ పరిసరాలలో వివిధ రకాల దేవుళ్ళను రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేయడం తో భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *