వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు వైసీపీ అభిమానులు, ప్రజా ప్రతినిథులు అధిక సంఖ్యలో కలిసి సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దర్శి, ఎస్ఎన్ పాడు నియోజక వర్గంతో పాటు, జిల్లాలోని పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పేదలకు కానుకలు అందజేత …
దసరా సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను చీమకుర్తిలోని బివిఎస్ఆర్ నిలయం వద్ద పేదలకు కానుకలు అందించారు. అధిక సంఖ్యలో పేదలు కానుకలు అందుకుని బూచేపల్లి కుటుంబానికి దీవేనలు అందించారు.









