ఆశ్వయుజ మాసం, పౌర్ణమి తిధి సందర్భంగా శ్రీ గిరి స్కందగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శోభాయమానంగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగినది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి కీర్తనలు, నామాలను పలుకుచూ పాల్గొన్నారు.
స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గో సంఘం వద్ద గోపూజ నిర్వహించి, బజంత్రీలు మ్రోగుచుండగా సుందరంగా అలంకరించిన రథముపై శేషవాహనారూఢుడై గంగా పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామి భక్తులను అనుగ్రహించారు.
కమిటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి కార్యక్రమ నిర్వహణ చేశారు.
