గుంటూరు కృష్ణాజిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
ఆలపాటి రాజాకు మద్దతుగా గురువారం సాయంత్రం నరసరావుపేటలో డాక్టర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన ఆలపాటి రాజా ని ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , అనుభవజ్ఞులైన రాజా ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం అభినందనీయమని అందుకు సి.ఎం కు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రులైన విద్యావంతులు, డాక్టర్లు అందరూ సమిష్టిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించుకుని కూటమి ప్రభుత్వానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.


