ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
వైద్యులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపి రిజిస్ట్రేషన్ విధానాన్ని సంబంధిత రిజిస్టర్స్ ను పరిశీలించారు. జనరల్ ఓపి వార్డును, ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, ఆపరేషన్ థియేటర్ ను, ఫోస్ట్ నెటల్ వార్డు, కాన్పుల వార్డు, స్టెరిలైజేషన్ రూమ్ ను, యాంటినెటల్ వార్డు ను తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. శానిటేషన్, సెక్యూరిటి సిబ్బంది వివరాలను, వారి అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలతోపాటు నిర్వహణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు పై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, వైద్యులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సంధ్య, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.




