ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి, మౌళిక వసతుల ఏర్పాటుకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సుందర రామయ్య అన్నారు. తాళ్లూరు పంచాయితీ పరధిలో శుక్రవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. సర్పంచి మేకల చార్లేస్ సర్జన్, ఎపీఓ మురళి, గ్రామకార్యదర్శి ఐ రమణా రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
