బత్తాయి తోటల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన వ్యవసాయాధికారులు రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఎండుకొమ్మల కత్తిరించి, అంతర్గత కలుపు నివారణకు పాటించాల్సిన చర్యలపై, వేరుకుళ్లు తెగులు సోకకుండా అందుకు వాటాల్సిన మందులపై రైతులకు వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, క్లస్టర్ ఉద్యానవన శాఖాధికారి రవివెంకన్న బాబు, విఏఏ వెంకట సుమ, ప్రకృతి ఇన్చార్జి పి నరసింహులు పాల్గొన్నారు.
