ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి – పలు గామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్చా ర్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని శంకరాపురం, నూజెండ్లపల్లి, మారెళ్ళ, జమ్మ లమడక, పూరిమెట్ల గ్రామాల్లో ఉపాధి హామి పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ …కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాలువలను జనవరిలోగా పూర్తిచేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పేద ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించటం జరుగుతుందన్నారు. మండలంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మారెళ్ళ సమీపంలో ఈదర వాగుపై ఉన్న నేల చప్టాను ఆమె పరిశీ లించారు. ఆర్అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరుచేసి బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శంకరాపురంలో రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.జనార్దన్, ఏపీవో కె. నాగరాజు, ఏపీఎం హనుమంతరావు, టీడీపీ మండల
మాజీ అధ్యక్షుడు సుంకర రాఘవరెడ్డి, ఎంపీటీసీలు పాలపర్తి సుబ్బారావు, డాక్టర్ పాశం వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, వరిగాని పౌలు, సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *