పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందనిటిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు అన్నారు. తాళ్లూరు మండలంలోని కొర్రపాటి వారి పాలెం గ్రామం లో శనివారం పల్లె పండుగ – ప్రగతి అండగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. సర్పంచ్ శ్రీదేవి , టిడిపి నాయకులు రామయ్య చిరంజీవి ,ఏపీఓ మురళి, వీఆర్ వర్క్ ఇన్స్పెక్టర్ దేవా , గ్రామకార్యదర్శు కళ్యాణ్ పాల్గొన్నారు.

