గ్రామ సభల ద్వారా రెవిన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలని రీ సర్వే డిటీ ప్రశాంత్ కోరారు. శివరామపురంలో గురువారం రీ సర్వే పై వచ్చిన సమస్యలపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు మాట్లాడుతూ రీ సర్వేలో రైతులకు వచ్చిన సమస్యలతో పాటు ఇతర రెవిన్యూ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే అవకాశం ఉన్న వాటిని మండల స్థాయిలో మిగిలిన ఎవైనా ఉంటే జిల్లా అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామ సభలో వివిధ సమస్యలపై 120 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. విఆర్ఓ చంద్రశేఖర్ రావు, గ్రామ సర్వేయర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

