నవంబర్ 11న నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలు జయప్రదం చేయాలి – ఎల్ఐసి ఆల్ ఇండియా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు ఆర్ . రామకోటి రెడ్డి

ఎల్ఐసి ఏవోఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఎల్ఐసి ఆల్ ఇండియా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు ఆర్ రామకోటి రెడ్డి కోరారు . దర్శి ఎల్ఐసి కార్యాలయం వద్ద సోమవారం ఎల్ఐసి ఏ ఓ ఐఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు , ఈ సందర్భంగా ఆర్ రామకోటిరెడ్డి మాట్లాడుతూ .. పాత విధానాన్ని కొనసాగించి ఏజెంట్లు కమిషన్ పెంచాలని జీఎస్టీ రద్దు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షలకు పెంచాలని , 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన ప్రతి ఏజెంట్ ను లైఫ్ మెంబర్ గా పరిగణించాలని , పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్ల కమిషన్ పెంచాలనారు… క్లాబ్యక్ ఆఫ్ ఆఫ్ కమిషన్ నిబంధన రద్దు గురించి సర్కులర్ రూపంలో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐ ఆర్డి ఏ ని అడ్డుపెట్టుకొని ఎల్ఐసి లో తీసుకు ని వస్తున్న హానికరమైన మార్పు వ్యతిరేకిస్తూ .. దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ ఆఫీసులో వద్ద ధర్నాలు నిర్వహించాలని ఆలిండియా పిలుపుమేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో అద్దంకి బ్రాంచి గౌరవాధ్యక్షుడు బోడపాటి హనుమంతరావు , బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె కాలే భాష , సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు , అభివృద్ధి అధికారి అమ్రూ నాయక్ ఏజెంట్లు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *