ఒంగోలు వాసి దండు శ్రీనివాస్ ప్రమోద దంపతుల కుమార్తె దండు ఆశ శ్రీ జూనియర్ నేషనల్ చాంపి యన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయినట్లు ఎపీ బ్యాడ్మింటన్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీధర్ తెలిపారు. విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో అండర్ 13 విభాగంలో సింగిల్స్, డబుల్స్ లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానంలో నిలచినట్లు చెప్పారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ నేషనల్ బ్యాండ్మిటన్ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. జిల్లా సంఘ ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి, శేషి రెడ్డి, కోచ్ అమ్మన గౌడ్ లార్డ్ క్రిష్ణా, బ్యాండ్మిటన్ అకాడమి ప్రసిడెంట్ అద్దంకి మురళీ క్రిష్ణ దండు ఆశశ్రీ ని అభినందించారు.
