ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక విన్నపాలను ఎస్పీ గారు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఆ ఫిర్యాదుల పూర్వాపరాలు అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.
అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వాటిపై వెంటనే విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం చేయాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై జాప్యం జగరకుండా నిర్ణీత గడువులో పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక/కుటుంబ తగాదాలు, అత్తరింటి వేధింపులు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ఎస్ బి డిఎస్పీ సురేష్ బాబు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బి.వి.శివరామకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
