లుపోటములు ముఖ్యం కాదు..క్రీడా స్ఫూర్తితో ఆడాలి – జిల్లా ఎస్పీ- క్రీడలలో ప్రత్యర్థులు ఉండరు.. అందరూ క్రీడాకారులే- క్రీడలు, ఆటలు…శారీరక, మానసికోల్లాసం కలిగిస్తాయి – పోలీసు సిబ్బందికి వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ – 2024 ను ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ – స్పోర్ట్స్ మీట్ లో పాల్గొననున్న 4 సబ్ డివిజన్ ల పోలీస్ లు మరియు ఆర్మే డ్ రిజర్వ్ పోలీస్ లు-ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొనే జిల్లా పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్- 2024 ను జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచకంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బెలూన్లు ఎగరేశారు. గత స్పోర్ట్స్ మీట్ లోని వ్యక్తిగత ఛాంపియన్ కాటం శ్రీను (పిసి.973) క్రీడా కాగడాను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కి అందచేయగా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా పోలీసు క్రీడాకారులును ఎస్పీ పరిచయం చేసుకొని, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ .. … జిల్లాలో వార్షిక పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగిందని, ఈ స్పోర్ట్స్ మీట్ ను 16,17 తేదీలలో వ్యక్తిగత మరియు జట్టు విభాగాల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ మొదలైన ఆటలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. క్రీడల సమయంలో ప్రత్యర్థులు అనే మాటకు తావు లేకుండా క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనాలని, పోలీస్ అంటేనే 365 రోజులు మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ విధులు నిర్వహించడమని, అటువంటి పోలీస్ సిబ్బందికి క్రీడా పోటీలు మానసిక స్థైర్యాన్ని, ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. పోలీసులుగా మన నియమ నిబంధనలను విధి నిర్వహణలో ఏ విధంగా పాటిస్తామో, అదేవిధంగా క్రీడలలో కూడా ఉన్న నియమావళిని తప్పనిసరిగా ప్రతి క్రీడాకారుడు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ వర్క్ అనేది సమిష్టితత్వంతో కూడుకున్నదని, సిబ్బంది మధ్య పరస్పర సహకారం, సమన్వయం, సమయస్ఫూర్తి ఉంటేనే విజయం వరిస్తుందని,అలాంటి స్ఫూర్తే పోలీస్ విధుల్లో కూడా ప్రతిబింబించడానికి ఈ స్పోర్ట్స్ మీట్ చాలా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని మంచి క్రమశిక్షణ కారుడిగా తీర్చిదిద్దేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు.

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఫలితమేదైనా స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఆడి క్రీడాస్ఫూర్తిని చాటాలని, వారి యొక్క సామర్థ్యాలను, పటిమను మరో స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సిబ్బంది అందరూ ఉత్సాహంగా పోల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతంగా చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ కోరినారు.

ఈ స్పోర్ట్స్ మీట్ జరుపుకోవటానికి అవకాశం కల్పించిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ కి మరియు గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ కి జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు లను చక్కగా చేసినందుకు, క్రీడా ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేసినందుకు ఎఆర్ పోలీస్ అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.

ఈ క్రింది అంశాలలో పోలీసు సిబ్బంది మరియు అధికారులకు పోటీలు నిర్వహించ బడతాయి.

I.పురుషుల కోసం నిర్వహించు ఆటలు: (1) వాలీ బాల్ (2) కబడ్డీ (3) టగ్ ఆఫ్ వార్ (4) షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్) (5) షటిల్ బ్యాడ్మింటన్ (డబుల్స్) (6) అధికారుల కోసం షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్) (SI& పైన) (7) షటిల్ బ్యాడ్మింటన్ (డబుల్స్) ఆఫీసర్స్ (SI & పైన) (8) క్రికెట్.

II.పురుషుల కోసం నిర్వహించు అథ్లెటిక్స్: (l) 100 మీటర్ల పరుగు, (2) 200 మీటర్ల పరుగు, (3) 40O మీటర్ల పరుగు,(4) 800 మీటర్ల పరుగు, (5) 1500 మీటర్లు (6) 4 x 100 రిలే పరుగు (7)4 x 400 రిలే పరుగు, (8) లాంగ్ జంప్, (9) హై జంప్, (10) షాట్ పుట్ (11) డిస్కస్ త్రో, (12) జావెలిన్ త్రో, (13) ట్రిపుల్ జంప్.

III.మహిళల కోసం నిర్వహించు ఆటలు: (1) వాలీ బాల్ (2) టగ్ ఆఫ్ వార్ (3) షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్) మహిళలకు, (2) మహిళలకు షటిల్ బ్యాడ్మింటన్ (డబుల్స్)

IV.మహిళలకు అథ్లెటిక్స్: (1) 100 మీటర్ల పరుగు (2) 200 మీటర్ల పరుగు (3) 400 మీటర్ల పరుగు,(4) 4 X100 రిలే (5) లాంగ్ జంప్ (6) షాట్ పుట్
(7) డిస్కస్ త్రో (8) జావెలిన్ త్రో

V.DPO స్టాఫ్ పురుషులు & మహిళలు:1) క్యారమ్స్ సింగిల్, (2) క్యారమ్స్ డబుల్స్, (3) టెన్ని కోయిట్స్ సింగిల్, (4) టెన్ని కోయిట్స్ డబుల్స్, (5) షటిల్ సింగిల్, (6) షటిల్ డబుల్స్.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావు,AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బి డిఎస్పీ సురేష్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, సిఐ లు, RIలు, ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *