విద్యార్థుల హక్కలు కాపాడటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వక్తలు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో పంచాయితీలలో సోమవారం బంగారు బాల్యం కార్యక్రమంలో విద్యార్థులకు పలు విభాగాలలో పోటీలు నిర్వహించారు. స్థానిక వికే ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలను ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తహసీల్దార్ సంజీవ రావు, ఎంపీడీఓ సుందర రామయ్య, ఎంఈఓ జి సుబ్బయ్య, ఎంఈఓ 2 సుధాకర రావు, సీడీపీఓ సిహెచ్ భారతిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల రక్షణ, నివాసం, బస, భోజనం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పోషక పదార్ధాలు తీసుకునే హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, లైంగిక వేదింపుల నుండి రక్షన సమాజం బాధ్యత అని చెప్పారు. విద్యార్థుల హక్కులను బాధ్యతల తెలియజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందని అన్నారు. మండల స్థాయి పోటీలలో విజేతలు వీరే….
అనంతరం మండల స్థాయిలో పలు పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. పెయింటింగ్లో బి. శ్రీవల్లిక (నాగంబొట్ల పాలెం), డ్రాయింగ్ లో ఎం హేమలత (కెబిబివి), స్లో గెన్స్ లో ఎం బ్యూలా ((వికే జిజెఎస్ ), వ్యాస రచన వి కావ్య (వికే జీ జెసీ), లోగో తయారీలో డి జ్యోస్న (సరస్వతి), వకృత్వం లో ఎస్ క్రిష్ణవేణి (లక్కవరం) లు మండల స్థాయిలో విజేతలకుగా నిలచినట్లు ఎంఈఓ జి సుబ్బయ్య తెలిపారు. బెల్లంకొండ పాలెం పంచాయితీలో, లక్కవరం హైస్కూల్లో బంగారు బాల్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో వికే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, హెచ్ఎం శేష గిరి, సూపర్ వైజర్ రాణి, బికేవీ పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, గ్రామకార్యదర్శి వల్లీలు పాల్గొన్నారు.




