తూర్పుగంగవరంలో గోల్డ్ షాపులో కిలాడీలు చోరీ – గుర్తించటంతో సొమ్ము తో ఊడాయించిన మహిళలు

తాళ్లూరు మండలంలో ప్రధాన వాణిజ్య కేంద్రం తూర్పుగంగవరంలో రద్దీగా ఉన్న గోల్డ్ దుకాణంలో ఇరువురు కిలాడీలు కమ్మలు కావాలంటూ వచ్చి కమ్మలను తీసుకుని ఉడాయించిన ఉదంతం చోటు చేసుకున్నది. వివరాలలోనికి వెలితే … తూర్పుగంగవరంలో ప్రధాన రోడ్లో ఉన్న విఘ్నేశ్వర గోల్డ్ దుకాణంలో ఇరువురు మహిళలు కమ్మలు కావాలంటూ చూపించాలని దుకాణం యజమాని సుబ్బా రెడ్డి, మహేంద్రలను కోరారు. వారు దుకాణంలో ఆరు జతల కమ్మలను చూపించగా బాక్స్ లోని నగలు తీసి వారి వద్ద ఉన్న గిల్ట్ నగలు అందులో అమర్చారు. దీన్ని గమనించి మహేంద్ర నాన నగలు మారుస్తున్నారంటూ కేక వేయటంలో ఒక్కసారిగా దుకాణం నుండి స్పీడుగా బయటకు పరుగులు తీసారు. సమీపంలో వారి కోసం వేచి ఉన్న గ్రే కలర్ కారులో ఎక్కి ఉడాయించారు. అప్పటికే షాపు యజమాని వారిని వెంబడించిన దొరక లేదు. ఆరు జతలు కమ్మలు నగలు 25 గ్రాముల వరకు ఉండవచ్చని దాదాపు రూ.2 లక్షల వరకు ఉండవచ్చని యజమాని తెలిపారు. దర్శి సీఐ రామా రావు, ఎఎస్సై మోహన రావు ఇచ్చిన సమా చారం తో దుకాణాన్ని పరిశీలించి సీసీ కెమోరాలో రికార్డు అయిన వివరాలను క్షున్నంగా పరిశీలించారు. విచారణ వేగవంతం చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *