జిల్లాలో 655.2 మి.మీల వర్షపాతం నమోదు

జిల్లాలో గురువారం 655.2 మి.మలు సరా సరి 17.2 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా కనిగిరిలో 130.2 మి.మీలు నమోదు కాగా అత్యల్పంగా పెద్దారవీడులో 1.2 మి.మీలు నమోదు అయినది. మండలాల వారిగా హెచ్ఎం పాడు 93.0, కొండెపి 46.8, పీసీ పల్లి 46.4, టంగుటూరు 38.4, సీఎస్ పురం 34.2, గిద్దలూరు 31.2, వెలిగండ్ల 27.6, పామూరు 26.4, రాచర్ల 25.6, కొమరోలు 24.2, పుల్లల చెరువు 20.0, సంతనూతల పాడు, కొత్త పట్నం, పొన్నలూరులలో 14.4, తాళ్లూరులో 13.4, మర్రిపూడి, శింగ రాయ కొండలలో 12.4. ఒంగోలు లో 9.4, దోర్నాల లో 3.6, బేస్త వారి పేట 3.4, జరుగు మల్లి 3.2, అర్థవీడు, కె కే మిట్ట లలో 2.4, యర్రగొండ పాలెం లో 2.2, పెద్దార వీడు 2.0, మార్కాపురం 1.2 చొప్పున నమోదు అయినది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫెయింజల్ తుఫాన్ వలన 10336 హెక్టార్లలో పంట నష్టం

జిల్లాలో ఫెయింజల్ తుఫాన్ వలన పలు పంటలు 10,336 హెక్టార్లలో నష్టం వాటిల్లి నట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో 103 గ్రామాలలో 7650 మంది రైతులకు చెందిన 10,336 హెక్టార్లు పలు పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అందులో వరి 676 హెక్టార్లు, మినుము 1902 హెక్టార్లు, శనగ 5506 హెక్టార్లు, కంది 85 హెక్టార్లు, పచ్చ పెసర 24, వరిగ 114, సజ్జ 48, జొన్న 48, పొగాకు 1333, ఉలవ 283, నువ్వులు 176, అలచంద 133 హెక్టార్లు ఉన్నట్లు చెప్పారు.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: photo; hw-remosaic: false; touch: (-1.0, -1.0); modeInfo: ; sceneMode: 8; cct_value: 5642; AI_Scene: (0, 2); aec_lux: 319.0556; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: 0; weatherinfo: null; temperature: 39;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *